NTV Telugu Site icon

ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీకి బ్రేక్.. అయినా ఆగ‌ని ప్ర‌జ‌లు..!

krishnapatnam

krishnapatnam

కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా మందు పంపిణీకి నిన్న‌నే బ్రేక్‌లు ప‌డ్డాయి… మ‌ళ్లీ ఎప్ప‌టి నుంచి ప్రారంభం అయ్యేదానిపై ఇంకా క్లారిటీ లేదు.. మందు పంపిణీ నిలిపివేసిన కార‌ణంగా ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నం రావొద్ద‌ని ఆనంద‌య్య‌తో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా కోరారు.. ఆనంద‌య్య మందుపై తుది నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే మందు త‌యారు చేయ‌డం గానీ, పంపిణీ గానీ ఉండే అవ‌కాశంఉంది. ఇప్ప‌టికే ఆయూష్ బృందం కృష్ణ‌ప‌ట్నంలో మ‌కాం వేయ‌గా.. ఇవాళ ఆయూష్ టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆనంద‌య్య మందు త‌యారు చేస్తార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. ఆ మందు, ప్ర‌జ‌ల నుంచి ఉన్న డిమాండ్‌పై అధికారుల‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చించారు.. వేల మందికి ఒక్క‌రోజు మందు త‌యారీ సాధ్యం కాద‌ని నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.. ఇదంతా ఓవైపు అయితే.. మ‌రోవైపు.. కృష్ణపట్నం గ్రామానికి కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో జనం త‌ర‌లివ‌స్తూనే ఉన్నారు.. మందు లేద‌ని తెలియ‌డంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మ‌రోవైపు.. కొంద‌రు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మ‌కాలు సాగిస్తున్నారు.. ఇది ఆనందయ్య మందే న‌ని చెబుతూ మోసం చేస్తున్నారు.