Site icon NTV Telugu

Girlfriend Harassment: విశాఖ లో దారుణం.. ప్రియురాలు వేధిస్తుందని ప్రియుడు ఆత్మహత్య..

Untitled 2

Untitled 2

Visakhapatnam: కాలం మారింది. అమ్మాయి అబ్బాయి అని తేడా లేదు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమ పేరుతో వాడుకోవాలని చూస్తేనే ముప్పు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడే ప్రేమించాలి. అలా కాకుండా కాలక్షేపానికి ప్రేమిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఆత్మ హత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా లోని గాజువాక లోని చిన గంట్యాడ శ్రీనివాస నగర్ కు చెందిన కోసనం భాస్కర్ రావు బాబీ అనే యువకుడు AVK డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అలానే జెమీమా అనే యువతి విజయవాడ కాలేజ్ లో నీట్ కి ప్రిపేర్ అవుతుంది. అయితే గత కొంత కాలంగా బాబీ, జెమీమా ప్రేమలో ఉన్నారు.

Read also:Ap Deputy Cm Amjad Basha: సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం

అయితే ఈ క్రమంలో జెమీమా తనని పెళ్లి చేసుకోమని కోరింది. అందుకు బాబీ నిరాకరించారు. దీనితో ఆ యువతి అట్రాసిటీ కేసు పెడతానని బాబీని వారం రోజుల నుండి బెదిరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భయానికి లోనైన బాబీ విషం తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. దీనితో జెమీమా బెదిరింపుల కారణంగానే బాబీ డిప్రెషన్ లోకి వెళ్లి దీపావళి రోజు పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు. అలానే తమ కొడుకు మరణానికి జెమీమా అనే యువతి కారణం అని బాబీ తల్లిదండ్రులు జెమీమా పైన గాజువాక పోలీసులకు కంప్లైంట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version