Boy Attempt Suicide In Girl Pregnancy Case In Kurnool: నేటి యువత ఎలాంటి పక్కదారి పడుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రేమ పేరుతో పెళ్లి కాకముందే ‘శోభనం’ కార్యక్రమాల్ని ముగించేసుకుంటున్నారు. కొందరైతే ఒకరికంటే ఎక్కువగా రిలేషన్‌షిప్‌లు మెయింటెయిన్ చేస్తున్నారు. కనీస కుటుంబ మర్యాదల్ని కూడా పట్టించుకోకుండా.. హద్దులు మీరుతున్నారు. గర్భం దాల్చడం, అబార్షన్‌లు చేయించుకోవడం కూడా సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఈ క్రమంలోనే కొన్ని నేరాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక విషయంలో విభేదాలు నెలకొని, జీవితాలు రోడ్డున పడే దుస్థితికి వచ్చేస్తోంది. కొందరైతే.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా ఈ ‘ప్రేమకథాచిత్రానికి’ బలైపోయాడు. ఇందులో ఓ అనూహ్య ట్విస్ట్ కూడా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
IRCTC: ప్రతి నెలా రూ. 80,000 సంపాదించే అద్భుత అవకాశం రైల్వే కల్పిస్తోంది.. త్వరపడండి
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన హనుమంతుడు అనే యువకుడు.. మల్లనహట్టికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అనుకోకుండా వీరి మధ్య పరిచయం ఏర్పడగా, అది ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. శారీరకంగానూ కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. అయితే.. ఆ యువకుడు మాత్రం తనకు ఆ యువతి గర్భంతో ఎలాంటి సంబంధం లేదని షాకిచ్చాడు. దాంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. హనుమంతుడు వల్ల తాను గర్భవతిని అయ్యానని, ఇప్పుడు అతడు ముఖం చాటేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని పిలిపించి విచారించగా.. తనకు ఏమీ తెలియదని, ఆ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణం తాను కాదని కుండబద్దలు కొట్టాడు. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయాలని, అందుకు తాను సిద్ధంగానే ఉన్నానని తెగేసి చెప్పాడు. ఈ దెబ్బతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.
Honey Trap: ‘మార్కెట్ మే నయా లడ్కీ’.. కక్కుర్తి పడ్డాడు.. రూ.50లక్షలు పోగొట్టుకున్నాడు
కానీ.. ఆ యువతి మాత్రం హనుమంతుడ్ని తరచు వేధించడం మొదలుపెట్టింది. ‘నీ వల్లే గర్భం దాల్చానని, ఈ బిడ్డకు తండ్రివి నువ్వే’నంటూ వేధింపులకు గురి చేసింది. తనకు సంబంధం లేనప్పుడు, తన వల్లే గర్భం వచ్చిందని ఎలా ఒప్పుకోవాలంటూ ఆ అబ్బాయి చెప్పుకొచ్చాడు. అయినా యువతి నుంచి వేధింపులు ఎక్కువ అవ్వడంతో, అవి తాళలేక యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకుముందు అతడు ఓ సెల్ఫీ వీడియో తీశాడు. తనకు సంబంధం లేకపోయినా, తన వల్లే గర్భం వచ్చిందంటూ యువతి తనని వేధిస్తోందంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.