NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఎమ్మెల్సీ అనంత్‌బాబు సస్పెన్షన్‌పై పార్టీ పెద్దలదే నిర్ణయం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత్‌ ఉదయ్‌భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కారులో డ్రైవర్ డెడీబాడీ దొరకడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్సీ విషయంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తారో లేదో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. బీసీ సంఘానికి జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

Nara lokesh: ఎమ్మెల్సీ అనంతబాబు కేసు.. సజ్జలపై లోకేష్ తీవ్ర ఆరోపణలు..

బీసీల సమస్యలను పెద్దల సభలో ఆయన స్పష్టంగా వినిపించగలరని తమ అభిప్రాయమని మంత్రి బొత్స తెలిపారు. ఆయన ఎక్కడవారన్నది ముఖ్యం కాదని.. ఎంత సమర్థవంతులో చూడాలని సూచించారు. ఆర్‌.కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించారని.. తమ నాయకుడికి ఆయనపై నమ్మకముందని పేర్కొన్నారు. బీసీ నాయకులతో తాము బస్సు యాత్ర చేపట్టబోతున్నామని.. తమ ప్రభుత్వం అన్ని వర్గాల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తుందని బొత్స స్పష్టం చేశారు. బీసీలకు చేసిన మేలు ప్రజలకు తెలియజెప్పాలనే ఈ యాత్ర చేపట్టినట్లు గుర్తుచేశారు. జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని.. వాటిపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు.