Site icon NTV Telugu

Bopparaju Venkateswarlu: ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు.. హక్కుల కోసం న్యాయపోరాటం

Bopparaju On Jac Movement

Bopparaju On Jac Movement

Bopparaju Venkateswarlu On JAC Movement: తాము చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని.. హక్కుల కోసం చేస్తోన్న న్యాయపోరాటమని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి అనవసర అపవాదులు అంటించవద్దని కోరారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని కుటుంబసభ్యులైన ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తారని అన్నారు. తమ వెనుక ఏ శక్తులు ఉండి నడిపించడం లేదని.. ప్రభుత్వ భాద్యతలను గుర్తు చేసేందుకే ఈ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలోకి రావాలని ఏపీ ఎన్జీఓతో జేఏసీ ఆరు నెలలుగా ప్రయత్నం చేశామని, సమావేశం ఏర్పాటు చేసుకుని వస్తామని చెప్పారని వెల్లడించారు. 10 నుంచి 5 వరకు పని చేస్తామని, ఇందుకు అధికారులు సహకరించాలని కోరామని తెలిపారు. ముందుగా ప్రకటించిన మేరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటికీ దిగిరాకపోతే.. ఏప్రిల్ 5న మలిదశ ఉద్యమంపై ఆలోచిస్తామన్నారు.

GIS 2023: జీఐఎస్‌ చారిత్రాత్మక విజయం సాధించింది.. సీఎం వల్లే ఇది సాధ్యమైంది

రాష్ట్ర కార్యవర్గం తీర్మానం మేరకు.. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందిచామమని బొప్పరాజు పేర్కొన్నారు. జేఏసీలోని నాలుగు టీములు.. 26 జిల్లాల్లో పర్యటిస్తున్నాయన్నారు. నాలుగేళ్లుగా ఓపికతో ఉన్నామని.. ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిజేసినా ఉద్యోగులకు రావాల్సిన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా, హక్కుగా రావాల్సినవి రాకుండా పోతాయన్న అభద్రతలో ఉద్యోగులు ఉన్నారన్నారు. పదోన్నతి కూడా రావన్న నేపథ్యంలో.. ఈ ఉద్యమానికి పూనుకున్నామని తెలిపారు. 11వ పియర్స్‌లో అనేకం కట్ చేసినా.. ఏడాదిగా ప్రభుత్వం హామీని అమలు చేస్తాయని వేచి ఉన్నామన్నారు. కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా.. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. చట్టాలను సడలించి ఇవ్వమని కోరినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న శాఖలో కాకుండా సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చట్ట సవరణలు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు.

CM Jagan: ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి

Exit mobile version