NTV Telugu Site icon

APSRTC Discount: సంక్రాంతి వేళ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్.. టికెట్లపై 10 శాతం డిస్కౌంట్

Apsrtc

Apsrtc

సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చూస్తూ వచ్చాం.. ఆర్టీసీకి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.. ఇక, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. పండుగలను క్యాష్‌ చేసుకునే పనిలో భాగంగా.. అదనంగా బాదేస్తూనే ఉన్నారు.. అయితే, సంక్రాంతి సమయంలో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో సంక్రాంత్రికి బుకింగ్స్ ప్రారంభించింది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.. www.apsrtconline.in వెబ్‌సైట్‌‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించిన ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.. అంతేకాదు.. రౌండ్ ట్రిప్ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు.. అంటే రాను, పోను టికెట్లను ఒకేసారి బుక్‌ చేసుకునే ప్రయాణికులకు.. ఆ టికెట్‌ ధరపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందే ఆఫర్‌ తీసుకొచ్చింది.

Read Also: Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌.. ఇవాళ ఐటీ విచారణ

అంటే, పండుగ సమయంలో.. అదనపు బాదుడు నుంచి ఉపశమనమే కాదు.. అప్‌ అండ్‌ డౌన్‌ టికెట్లు బుక్‌చేసుకున్నవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ తీసుకొచ్చి శుభవార్త చెప్పింది ఏపీఎస్‌ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు.. వెబ్‌సైట్, యాప్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది.. అయితే, సంక్రాంతిని పురస్కరించుకుని.. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా.. వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోన్న విషయం విదితమే.. ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉండే రూట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఏపీఎస్‌ ఆర్టీసీ. రౌండ్ ట్రిప్ బుక్‌ చేసుకునేవారి కోసం ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది.. రాను, పోను టికెట్లను ఒకేసారి బుక్‌ చేసుకుంటే.. రిటర్న్‌ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందే ఆఫర్‌ తీసుకొచ్చింది ఆర్టీసీ.

Show comments