Site icon NTV Telugu

శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్ నిలిపివేత

నాగార్జునసాగర్- శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. బోట్ తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని టూరిజం శాఖను అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బోట్ సర్వీసులు నిలివేశారు. కాగా ఈ బోట్ దాదాపు అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ప్రయాణిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ ప్యాకేజీని అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Read Also: మరో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

కాగా నాగార్జునసాగర్ నుంచి నందికొండ, శ్రీశైలం వెళ్లే బోట్ మార్గం మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం కేటాయించాలని అటవీశాఖ కోరింది. ఇక దీనిపైనే టూరిజం, అటవీ శాఖ అధికారులు త్వరలో చర్చించనున్నారు. చర్చల అనంతరం తిరిగి బోట్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు టూర్‌లకు టికెట్‌ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లిస్తే ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది.

Exit mobile version