ఒకవైపు కరోనా మహమ్మారి దేశాన్ని భయపెడుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ నగరాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. నగరంలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఈ కేసులు నమోదయ్యాయి. అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇదే విధమైన పరిస్తితి నెలకొన్నది.
విజయవాడ లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…
