NTV Telugu Site icon

చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ కేసులు…

చిత్తూరు జిల్లాలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది.  క‌రోనా కేసుల‌తో పాటుగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు కూడా పెరుగుతున్నాయి.  జిల్లాలో ఇప్పటివ‌ర‌కు మొత్తం 135 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయి.  తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో 67, స్విమ్స్ లో 70 కేసుల‌ను నిర్ధారించారు.  ఇక బ్లాక్ ఫంగ‌స్‌తో ఇప్పటి వ‌ర‌కు జిల్లాలో ఇద్ద‌రు మృతి చెందారు.  బ్లాక్ ఫంగ‌స్ కు మందుల కొర‌త తీవ్రంగా ఉన్న‌ది.  దీంతో రోగుల‌కు అర‌కొర‌గా వైద్యం అందుతున్న‌ది.  చిత్తూరుతో పాటుగా మిగ‌తా జిల్లాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉద‌యం 12 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉన్న‌ది.  ఉద‌యం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టిరోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లు జరుగుతున్న‌ది.