చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఒక్కరోజులో రికార్డ్ స్టాయిలో 15 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 9 కేసులు, స్విమ్స్ ఆసుపత్రిలో 6 కేసులు నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 33 కి చేరింది. తిరుపతి రుయాలో 21, స్విమ్స్ లో 12 కేసలకు చికిత్స జరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటే, జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతి చెందారు. కరోనాతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం ఆయ్యారు.
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు… ఒక్కరోజులో…
