Site icon NTV Telugu

BJP: ఏపీలో బీజేపీ భారీ స్కెచ్‌.. ఏకంగా 5 వేల సభలు..!

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ దూకుడు చూపిస్తోంది.. ఇప్పటికే వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది.. బీజేపీని పరుగులు పెట్టిస్తామని కమలనాధులు గత కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.. ఏపీలో వైసీపీ-టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో స్కెచ్‌ సిద్దం చేసుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యక్రమాలను శ్రీకారం చుట్టాలని డిసైడ్‌ అయ్యింది.. దీంట్లో భాగంగా.. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఓ భారీ క్యాంపెయినింగ్‌ ప్రొగ్రామును ప్లాన్‌ చేసింది బీజేపీ. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌ పేరుతో భారీ సంఖ్యలో అంటే మొత్తంగా 5 వేల సభలను నిర్వహించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఓ విధంగా చెప్పాలంటే గల్లీ మీటింగ్స్‌ తరహాలో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది బీజేపీ.

Read Also: Nadendla Manohar: అక్కసుతో దాడి.. జెండా దిమ్మెల ధ్వంసంతో మా ప్రస్థానాన్ని ఆపగలరా..?

ఈ విధంగా చేయడం ద్వారా సభలకు జనసమీకరణకు పని లేకపోవడంతోపాటు.. ప్రజల వద్దకే వెళ్లి రోడ్‌షోలు నిర్వహించినట్టుగా ఎక్కడికక్కడ స్థానిక నేతలు స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు పెడితే కేంద్ర ప్రభుత్వ విధానాలను.. బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేయొచ్చనేది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఈ మీటింగ్సులో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులెన్ని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే విషయాలను లెక్కలతో సహా వివరించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది బీజేపీ. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏయే సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్ట్రీట్‌ మీటింగ్స్‌ను వేదికగా చేసుకోనున్నారు ఏపీ కమలనాధులు.

ఈ స్ట్రీట్‌ మీటింగ్సుకు ప్రాధాన్యత తెచ్చేందుకు.. వీలైనన్ని సభల్లో ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చెందిన నేతలు పాల్గొనేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో కేంద్ర నాయకత్వం నుంచి కొందరు కీలక నేతలను.. అలాగే కేంద్ర మంత్రులను కూడా ఈ స్ట్రీట్‌ మీటింగ్సులో పాల్గొనేలా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకోవాల్సిందిగా ఏపీ నేతలు కోరినట్టు సమాచారం. మొత్తంగా.. ఏపీలో కమలనాథులు దూకుడు చూపిస్తున్నారు.

Exit mobile version