CM Ramesh: రాజ్యసభ ఎథిక్స్ కమిటీని పునర్‌వ్యవస్థీకరిస్తూ సభ కార్యాలయం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది. అటు ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్‌కు అరుదైన అవకాశం దక్కింది. హౌస్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రమేష్‌ను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి సభ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజ్యసభ నుంచి ఈ నెల 2నే ఓ ప్రకటన విడుదల కాగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Also: Weddings: అవి లేక.. ఒకే నెలలో 32 లక్షల పెళ్లిళ్లు
రాజ్యసభ హౌజ్ కమిటీ చైర్మన్ హోదాలో సభ్యులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించే కీలక బాధ్యతలను సీఎం రమేష్ పర్యవేక్షించనున్నారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి రాజధానిలో సర్కారీ బంగ్గాలను కేటాయించడం, పదవీ కాలం పూర్తయిన సభ్యులను ఆయా బంగ్లాల నుంచి ఖాళీ చేయించడం కూడా ఈ కమిటీ బాధ్యతే. ఇక సభ్యులకు కేటాయించిన బంగ్లాల్లో ఆయా సౌకర్యాల ఏర్పాటును కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. కాగా ఇటీవల పవన్ భద్రతపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని.. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు పవన్ భద్రతను పట్టించుకోవడం లేదని సీఎం రమేష్ ఆరోపించారు.
