Site icon NTV Telugu

Satyakumar: బీజేపీ సైనికులం.. మేం పార్టీలు మారలేదు

Satyakumar

Satyakumar

ఏపీలో వైసీపీ-బీజేపీ నేతలు కత్తులు నూరుకుంటున్నారు. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత సత్యకుమార్. నేనేదో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. .శ్రీకాంత్ రెడ్డి తండ్రి టీడీపీ అనే విషయం మరిచినట్టున్నారు. మేం బీజేపీ సైనికులం.రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.హైకోర్టు కర్నూల్లో ఉండాలనే దానికి బీజేపీ కట్టుబడి ఉంది.హైకోర్టు తరలింపునకు సంబంధించి హైకోర్టు సీజేతో మాట్లాడరా..? లేదా..?హైకోర్టు తరలింపునకు సంబంధించి కేంద్రానికి ఏమైనా ప్రతిపాదనలు పంపారా..?

హైకోర్టు తరలింపునకు సంబంధించి ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా హైకోర్టు గాల్లో ఎగిరి వెళ్లిపోతుందా..రాయలసీమలో రైల్వే లైన్లు, రోడ్లు వేసింది బీజేపీనే.ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకుని శంకుస్థాపనలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.కడప స్టీల్ ప్లాంట్ కేంద్రం కడతానంటే.. మేమే కడతామంటూ మొదలు పెట్టారు.కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసి మూడేళ్లు అయింది.. ఏమైంది ఆ స్టీల్ ప్లాంట్.ఏపీలో మోడీ 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

Etela Rajender : కేసీఆర్ నెత్తిన శని ఉంది.. పొయ్యే కాలం వస్తే ఎవడు ఆపలేరు…

అధికార పార్టీని ప్రశ్నిస్తాం కానీ.. శంకరగిరి మాన్యాలు పట్టిన టీడీపీని ఎందుకు ప్రశ్నిస్తాం.ఓ వ్యక్తి వెనక నుంచి పట్టుకుంటానంటారు.. మరో వ్యక్తి గంట అంటారు.. ఇంకో వ్యక్తి నిర్వాకం ఆంధ్ర దేశం మొత్తం చూసింది.మీ పార్టీలో ఎలాంటి నేతలున్నారో అందరికీ అర్ధం అవుతూనే ఉంది.

China-Taiwan Issue: అమెరికాకు షాకిచ్చిన చైనా.. నాన్సీ పెలోసిపై ఆంక్షలు విధించిన డ్రాగన్ దేశం

Exit mobile version