Site icon NTV Telugu

Biswa Bhusan Harichandan: హస్తిన చేరుకున్న ఏపీ గవర్నర్.. నేడు ప్రధానితో కీలక భేటీ

Governor Harichandan

Governor Harichandan

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలతో ఆయన విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్లగా.. శుక్రవారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం కానున్నారు.

అయితే ఏపీ గవర్నర్ హరించందన్ మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల కారణంగా చాలాకాలంగా ఆయన ప్రధానిని కలవలేకపోయారని. .అందువల్లే ఇప్పుడు కలుస్తున్నారని వివరణ ఇచ్చాయి. అయితే ప్రధానితో భేటీలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై గవర్నర్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఆ అంశాలపై ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Minister Vishwaroop: త్వరలోనే తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు

Exit mobile version