Bhuma Akhila Priya Challenges MLA Shilpa Ravi: ఎమ్మెల్యే శిల్పా రవికి భూమా అఖిల ప్రియ ఛాలెంజ్ చేశారు. భూమా కుటుంబం అరాచకాలు, కబ్జాలు చేస్తున్నారని చేసిన ఆరోపణల్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. నంద్యాల గాంధీ చౌక్‌కి ఆధారాలతో రావాలన్నారు. హైదరాబాద్‌లో తమ ఆస్తుల్ని వేరేవాళ్లు కబ్జా చేస్తే.. దాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నానని అన్నారు. భూమా నాగిరెడ్డిని, టీడీపీ నేతలను విమర్శించినదుకు సమాధానం చెప్పాల్సి వచ్చిందన్నారు. లోకేష్ దృష్టిలో పడేందుకు శిల్పా రవి నానా పాట్లు పడ్డారని.. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని తనని అడ్డుకున్నారని చెప్పారు. రూ.200 కోట్ల భూమి కుంభకోణంకు పాల్పడ్డారని ఆరోపించారు. చాబోలు వద్ద బైపాస్ వస్తుందని తెలిసి.. 2005-2007లో ఎస్సీలకు సంబంధించి రూ. 5 లక్షలు చొప్పున 50 ఎకరాలను పోచ బ్రహ్మానంద రెడ్డి పేరుతో రిజస్ట్రేషన్ చేయించారని.. మరి ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అని నిలదీశారు. రైతులను మభ్యపెట్టి, బైపాస్ వస్తుందన్న విషయం దాచిపెట్టి, ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపణలు చేశారు. నూనెపల్లిలో పలు సర్వే నంబర్లలో శిల్ప మోహన్ రెడ్డి పేరుపై 32 ఎకరాలు కూడా కొన్నారని పేర్కొన్నారు.
INDvsAUS Test: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చంటే?
ఇన్సైడ్ ట్రేడింగ్‌లో కొన్న భూముల పక్కనే మెడికల్ కాలేజీని ఆర్ఏఆర్ఎస్ భూముల్లో బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారని భూమా అఖిల ప్రియ చెప్పారు. శిల్పా కుటుంబం ఒక్కో ఎకరా రూ. 5 లక్షలకు కొని, రూ.10 కోట్లు ధర వచ్చేలా చేశారన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని, జోనల్ క్లాసిఫికేషన్ అనే పేరు సృష్టించారన్నారు. తన భూములను కమర్షియల్ జోన్‌గా గుర్తించేలా శిల్పా రవి చేశారన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి తన భూములకు వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డు వేయించుకున్నారన్నారు. రైతుల భూములను రిక్రియేషన్ భూములుగా గుర్తించారని, చాబోలు వద్ద ఇండస్ట్రియల్ జోన్‌గా గుర్తించి రైతులకు నష్టం చేశారని, ఇదంతా భారీ కుంభకోణం కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అక్కడున్న కుంట నీరు పోచ బ్రహ్మానంద రెడ్డి ఫ్యాక్టరీకి వాడుకుంటున్నారని బాంబ్ పేల్చారు. కలెక్టర్, ఆర్డీఓకి ఫిర్యాదు చేశారని.. అక్రమాలపై ఆర్డీఓ నివేదిక ఇచ్చారని తెలిపారు. రెండో విడత, మూడో విడత కూడా అక్రమాల్ని బయటపెడతానన్నారు. శిల్పా సేవా సహకార్, రైతు సేవా సహకార్ పేరుతో 40 షాపులకు 40 వేలు చెలిస్తూ.. అక్కడ ఒక్కో షాప్‌కి రూ. 22 వేలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డుకు రావాల్సిన ఆదాయాన్ని శిల్పా రవి కుటుంబం కొట్టేస్తున్నారన్నారు.
Cancer Patients : తెలంగాణలో 2025 నాటికి 53 వేల మంది కేన్సర్ రోగులు
లోన్ల పేరుతో మహిళలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, శిల్పా రవి చర్చకు రావడానికి భయపడుతున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకొని తనని అడ్డుకుంటున్నారు అఖిల ప్రియ చెప్పారు. ఆడవాళ్ళని శిల్పా రవి తక్కువ అంచనా వేయడం తగదన్న ఆమె.. పోలీసులు, అధికారం లేకుంటే వాళ్ళు బతకలేరన్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామన్నారు. ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ.. తనని మాత్రం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేయమని, తాను టీడీపీకి రాజీనామా చేస్తానని, పార్టీలకు అతీతంగా పోటీ చేద్దామని సవాల్ విసిరారు. బాబాయ్‌కి మంత్రి పదవికి రాకుండా, శిల్పా రవి అడ్డుకున్నారన్నారు. అవినీతి, అక్రమాలు అంటూ ఇంకోసారి ఎవరైనా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించే హోదా శిల్పా రవికి లేదని.. పార్టీ మారడంలో శిల్పా కుటుంబం ముందు వరుసలో ఉంటుందని దుయ్యబట్టారు. తాను చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమని భూమా అఖిల ప్రియ తేల్చి చెప్పారు.