NTV Telugu Site icon

Rammohan Naidu: మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తాం..

Ram Moihan Naidu

Ram Moihan Naidu

Rammohan Naidu: దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్ పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో 24 విమానాశ్రయంలలో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి.. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారు. డీజీ యాత్ర ఒక విప్లవాత్మకమైన మార్పు.. ఈ సేవలు ద్వారా ప్రయాణికులు సులభతరంగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించవచ్చు అని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నా హోమ్ ఎయిర్ పోర్టు.. భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులు రాబోతున్నాయి.. అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖ నుంచి విజయవాడకు ఉదయం ఒక విమానం సేవలు ప్రారంభిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

Read Also: Pragya Nayan Sinha : అందాలతో కుర్రకారును టెంప్టింగ్ చేస్తున్న ప్రగ్యా

ఇక, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి నా వంతు కృషి చేస్తాను అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మరో రెండు సంవత్సరాలలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి తీసుకొస్తాం.. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఆలోచన చేస్తానున్నాము.. విశాఖ ఎయిర్ పోర్టులో కార్గో సేవలను పెంపొందిస్తాం.. ప్రజలకు మంచి సేవలు అందించడంలో పౌర విమానయాన శాఖ ముందు ఉంటుంది.. దేశంలో ఎయిర్ పోర్టు సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. డీజీ యాత్ర యాప్ లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయి.. విమాన ప్రయాణికులు తప్పకుండా డీజీ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.. డీజీ యాత్ర ద్వారా ప్రయాణికులు సులభంగా విమాన ప్రయాణం చేయవచ్చును అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Show comments