Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bheemavaram Dsp Raghuveer Sankranti Speech Viral

Viral : భీమవరం సంక్రాంతి ఉత్సవాల్లో తీవ్ర కలకలం రేపుతున్న DSP వ్యాఖ్యలు

Published Date :January 11, 2026 , 8:49 pm
By Gogikar Sai Krishna
  • భీమవరంలో డీఎస్పీ మాస్ కామెంట్స్
  • "ఆ ఊపు ఎక్కడ?" అంటూ స్టేజీపై సెటైర్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • పండుగ సంబరాల్లో హైలైట్‌గా నిలిచిన ప్రసంగం
Viral : భీమవరం సంక్రాంతి ఉత్సవాల్లో తీవ్ర కలకలం రేపుతున్న DSP వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన వ్యాఖ్యలే. పోలీస్ యూనిఫాంలో వేదికపైకి ఎక్కిన ఆయన, తనలోని కళా హృదయాన్ని బయటపెడుతూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భీమవరం సంక్రాంతి సంబరాల్లో అసలు ఊపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వేదికపై మైక్ అందుకున్న డీఎస్పీ రఘువీర్, ప్రేక్షకుల నిస్తేజంపై సూటిగా స్పందించారు. “భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లేదు.. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు” అని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సంక్రాంతి అంటేనే ఉత్సాహం, కేరింతలు ఉండాలని, కానీ ఇక్కడ ప్రేక్షకులు సైలెంట్‌గా ఉండటం తనకు నచ్చలేదని ఆయన సరదాగా మందలించారు.

డీఎస్పీ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమా పాటలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు నవ్వులు పూయించాయి. “ఓరోరి యోగి నన్ను కుదిపేయరా అంటూ డాన్సర్ పాడుతుంటే, కనీసం ఎవరూ కుదుపుకోకపోతే ఎలాగయ్యా?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ పాటను ఉద్దేశించి.. “ఆమె అక్కడ కుర్చీ మడతపెడుతుంటే, కనీసం ఎవరూ మడతపెట్టకపోతే ఎలా?” అంటూ ఆవేదనతో కూడిన ప్రశ్నలు సంధించారు.

డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్టేజీపై ఉన్న తోటి అధికారులు, ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయనలోని ఉత్సాహాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలతో సందడి చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా, ప్రజలతో మమేకమవుతూ ఆయన చేసిన ఈ ‘మాస్’ ప్రసంగం భీమవరం పండగ సంబరాల్లో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి, భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, “డీఎస్పీ గారు మామూలోడు కాదు.. భలే కుదిపేశారు!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Women Rule: ఈ దేశంలో పురుషులందరూ బానిసలే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra pradesh police
  • Bheemavaram
  • DSP Raghuveer
  • Festival News
  • Sankranti Celebrations

తాజావార్తలు

  • Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

  • Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..

  • Movie Shootings: సినిమా షూటింగ్’లపై గ్యాస్ గుది బండ

  • Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..

  • Power Demand: తెలంగాణలో చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions