Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గణేష్ ప్రతిమతో పాటు భగవద్గీతను తీసుకు వెళ్లారు అని గుర్తు చేశారు. ప్రధాని మోడీ విదేశి పర్యటన సమయంలో ఆయా దేశాల ప్రతినిధులకు భగవద్గీతను బహుకరిస్తారని పేర్కొన్నారు. హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Allu Sirish: అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి – అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ పోస్ట్ వైరల్!
అయితే, ఓ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల మన బతుకులు మార్చ బడలేదు.. కేవలం రాజ్యాంగ వల్లే మారతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే సహించేది లేదని పేర్కొన్నారు.
