Site icon NTV Telugu

భక్తులతో కళకళలాడిన భద్రాద్రి

కార్తీక మాసం చివరిరోజు కావడంతో ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఏవీ నగరం నుంచి సుమారు వందమంది భక్తబృందం రామనామ స్మరణ చేస్తూ ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. మూలవరులకు ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జిత సేవగా సువర్ణపుష్పార్చన, సహస్రనామార్చన, కేశవనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి తొలుత సహస్రనామార్చన నిర్వహించి అనంతరం కల్యాణ తంతు కొనసాగించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు.

Exit mobile version