ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దైంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పవన్‌కల్యాణ్ పర్యటన రద్దైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున హెలీకాప్టర్‌కు అనుమతి లభించలేదు. దీంతో గురువారం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దైంది. మరోసారి బాపట్ల జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
ఇక బుధవారం కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ సభ నిర్వహించింది. సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభకు పవన్‌కల్యాణ్ హాజరై ప్రసంగించారు. 10 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Midhun Reddy: నేడు రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న ఎంపీ మిథున్‌రెడ్డి
