Site icon NTV Telugu

Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ

Tpt

Tpt

​Land Dispute: భూ ఆక్రమణలపై తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది. చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ రెవెన్యూ పరిధిలో భూ వివాదం.. ​బాపట్ల ఎస్పీ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ​హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ​పూర్తిస్థాయి విచారణ అధికారిగా జేసీ గోవిందరావు నియామకం అయ్యారు. ​687, 688, 689 సర్వే నంబర్లలో 11.71 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ​రోడ్లు, అటవి బఫర్ జోన్లు, కుంటలను కలిపి వేసుకున్నారని రెవెన్యూ అధికారుల ప్రాథమిక నివేదికలో తేలింది.

అయితే, ​ప్రభుత్వ భూమిలో అక్రమంగా మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ​రెండు మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న జేసీ గోవిందరావు పేర్కొన్నారు. ​జేసీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Exit mobile version