Site icon NTV Telugu

ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు: బండి శ్రీనివాసరావు

ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 3వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగుల పరిస్థితి రివర్స్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కావాలనే రెచ్చగొడుతుందన్నారు. మిశ్రా కమిటీ సిఫార్సు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉనికిలో లేని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి మమ్ముల్ని అవమానపరిచారననారు.

Read Also: వినోద్ జైన్‌కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే సూసైడ్‌ నోట్‌ రాసింది: వాసిరెడ్డి పద్మ

ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా మేము సమ్మెలోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని బండి శ్రీనివాసరావు అన్నారు. కొత్త పీఆర్సీ కారణంగా ఉద్యోగి లక్ష రికవరీ పెట్టాల్సి ఉంటుందన్నారు. ఆదివారం ‌అయిన ట్రెజరీ ఉద్యోగులను విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందన్నారు. ట్రెజరీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తే రెండు రోజుల ముందుగా అత్యవసరంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిస్తున్నట్టు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Exit mobile version