Site icon NTV Telugu

Balineni Srinivasa Reddy: నేను క్యాసినోలకి వెళ్తా.. పేకాట ఆడుతా.. కానీ!

Balineni Srinivas On Casino

Balineni Srinivas On Casino

Balineni Srinivasa Reddy Clarity On Links With Chikoti Praveen: చికోటి ప్రవీణ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈడీ దాడులు చేయడం, నోటీసులు ఇవ్వడంతో.. కేసినోలు నిర్వహించే చికోటితో లింక్స్ ఉన్న సినీ తారలు, రాజకీయ నేతల పేర్లు తెరమీదకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చికోటితో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిలో ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేరు కూడా వినిపించింది.

ఈ ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరావు స్పందించారు. చికోటితో తనకు సంబంధాలున్నాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తోసిపుచ్చారు. ‘‘అవును.. నేనే కేసినోలకు వెళ్తాను, పేకాట కూడా ఆడుతాను, ఈ విషయాన్ని నేనే స్వయంగా ఒప్పుకుంటాను. కానీ.. చికోటితో మాత్రం నాకెలాంటి సంబంధం లేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు’’ అని బాలినేని తెలిపారు. తాను నిజాలను ఒప్పుకుంటానని.. తనకు డ్రామాలు చేయడం రాదని తేల్చి చెప్పారు. తాను ఏ విధమైన విచారణకైనా సిద్ధమేనని బాలినేని వెల్లడించారు.

Exit mobile version