Site icon NTV Telugu

బద్వేల్ బై పోల్: 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్

బద్వేల్ బై ఎలక్షన్ లో ఉదయం 11 గంటల వరకు 20.89% పోలింగ్ నమోదని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ వెల్లడించారు. మాక్ పోలింగ్ సమయం లో ఒకటి రెండు పని ఈవీఎమ్ లు పని చేయకపోతే వెంటనే రిప్లేస్ చేశామని ఆయన ప్రకటించారు. ఎక్కడా ఈవీఎమ్ లు మొరాయించి పోలింగ్ ఆలస్యం అయిన సంఘటన ఎదురవలేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి.

ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్0 నమోదయ్యిందని.. ఆ తర్వాత కాస్త పెరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని… దొంగ ఓటర్లు వంటి సంఘటనలు జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇంత వరకు మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. కాగా.. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది.

Exit mobile version