Site icon NTV Telugu

Ayyannapatrudu: ఎన్టీఆర్ కుమార్తె మరణంపై శవ రాజకీయమా?

Ayyannapatrudu On Devender

Ayyannapatrudu On Devender

Ayyannapatrudu Fires On Gurrampati Devender Reddy: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ వ్యతిరేకుల్ని బూతులు తిట్టడమే దేవేందర్ రెడ్డి పని అని, అందుకే అతడనికి లక్షల రూపాయల జీతమిచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారని విమర్శించారు. భూమి విషయంపై లోకేశ్, ఉమా మహేశ్వరి మధ్య గొడవ జరిగిందని దేవేందర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అతడు ఆరోపించినట్టు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లు తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ధరణ పోర్టల్‌లో తప్పని తేలాయన్నారు. ఇదేం శవరాకీజయం జగన్‌రెడ్డీ? అంటూ నిలదీసిన అయ్యన్నపాత్రుడు.. మీ పార్టీని నడిపించుకోండి కానీ, ఇలాంటివి మానుకోండని హితవు పలికారు.

ఇదిలావుండగా.. ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై దేవేందర్ రెడ్డి సోషల్ మీడియాలో ‘సహజఠాన్మరణాత్మహత్య కథ’ రాసుకొచ్చారు. మొదటి భర్త నరేంద్ర రాజన్‌తో ఉమా విడాకులు తీసుకోవడం దగ్గర నుంచి.. ఆమె రెండో పెళ్ళి చేసుకోవడం, హెరిటేజ్ సంస్థలో 500 కోట్లు పెట్టుబడులు పెట్టడండి వంటివి ప్రస్తావించారు. ఆ సొమ్ములకు వ్యవహారంలో విభేదాలు తలెత్తడం, హైదరాబాద్‌లోని భూమి విషయంలో మోసం చేయడంతో.. ఉమామహేశ్వరి, లోకేష్ మధ్య గొడవ జరిగిందని.. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆ కథలో పేర్కొన్నారు. అలాగే.. అవతలి చావు బతుకులపై అవాకులు, చవాకులు పేల్చే మీడియా.. ఉమా మృతిపై ఎందుకు డిబేట్లు పెట్టడం లేదంటూ ట్వీట్ చేశారు. ‘ఉరితాడు ఎవరు లాగారో.. పదిమందికి పైగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉన్న ఎన్టీఆర్ కూతురుకి అంత కర్మ ఎందుకు పట్టిందో డిబేట్లు పెట్టే సత్తా లేదా?’ అంటూ ట్వీటారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆయనపై తారాస్థాయిలో మండిపడుతున్నారు.

ఇదిలావుండగా.. ఉమామహేశ్వరి మృతిపై వైసీపీ నేతలు లక్ష్మీపార్వతి, విజయసాయి రెడ్డి రాజకీయం చేయడం అత్యంత నీచమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. వారి మాటలు, ప్రవర్తన చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లోకేశే ఉమాని చంపారని ఒకసారి, చంద్రబాబు వెనుకుండి ఈ కుట్ర పన్నారంటూ మరోసారి విజయసాయి రెడ్డి ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో.. నాదెండ్ల పై విధంగా స్పందించారు.

Exit mobile version