Site icon NTV Telugu

టీడీపీ నేత పల్లా కుటుంబం భూకబ్జాలకు పాల్పడింది…

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడింది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏమ్మెల్యే గా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారు. పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నాంచంద్రబాబు పెద్ద భూకుంభకోణానికి నాంది పలికాడు. వారి బాటలోనే పల్లా శ్రీనివాస్ ఆక్రమణలకు పాల్పడ్డారు. మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మా హయాంలో మా నాయకులు ఎవ్వరు భూకబ్జా లకు పాల్పడలేదు. టీడీపీ నేతలు తప్పు చేసి, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. విశాఖ లో పల్లా శ్రీనివాసరావు , కుటుంబ సభ్యులు దిగజారి భూములు అక్రమించుకున్నారు అని పేర్కొన్నారు.

Exit mobile version