NTV Telugu Site icon

బ్రేకింగ్‌ : లోక్‌సత్తా నేతపై కర్రలతో దాడి..

crime

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్‌సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు.

దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌ కు చేరుకున్న వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.