Site icon NTV Telugu

Atchannaidu: టీడీపీ వచ్చాకే అట్టడుగు, బలహీనవర్గాలకు న్యాయం

Tdp (2)

Tdp (2)

కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది టీడీపీ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం. వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంAnasuya: వాటిని చూపిస్తూ అనసూయ షో.. అందరి చూపు ఆ పుట్టుమచ్చ మీదనేద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రేపటి నుంచి మే 28వరకు వివిధ ప్రదేశాల్లో వంద సమావేశాలు ఏర్పాటు చేస్తారు. 42పార్లమెంట్ నియోజకవర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం అన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.

Read Also: Cyber Crime: టవల్స్ కోసం ఆర్డర్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేశారు

ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలి.సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నాడో జగన్ చెప్పాలి?వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా.. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఏపీకి చెందిన 13.. తెలంగాణకు చెందిన 4.. పొలిట్ బ్యూరో లో మెత్తం 17అంశాలపై చర్చించాం.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి కనీసం‌ సమీక్ష జరకకపోవటం దుర్మార్గం. తన తప్పును ఒప్పుకొని సీఎం జగన్ జీవో నంబర్ 1ని వెనక్కి తీసుకోవాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. టీడీపీ వచ్చాకనే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు అచ్చెన్నాయుడు.

నాలుగేళ్ళుగా పది లక్షల కోట్ల అప్పు చేసిన హీనచరిత్ర జగన్ ది. కొత్తవి దేవుడెరుగు.. జగన్ ధన దాహానికి పాత పరిశ్రమలు తరలిపోతున్నాయి. జీతాల‌ కోసం ప్రభుత్వ ఉద్యోగులు దర్నాలు చేయాల్సిన పరిస్థితి బాధాకరం. ఐదు వేల రూపాయలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించాం. రేపు మధ్యాహ్నం 3 గంలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందన్నారు అచ్చెన్నాయుడు.

Read Also:Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ సహాయకుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కొడుకుతో సంబంధాలు..

Exit mobile version