NTV Telugu Site icon

Atchannaidu: జగన్ వారసత్వం మంత్రులు తీసుకున్నారా?

Atchanna 1

Atchanna 1

ఏపీలో తాజా పరిణామాలపై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తుని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ శేషగిరిరావు పై ఇంటి వద్ద కత్తితో దాడిచేయడంపై మండిపడ్డారు. జగన్ రెడ్డి గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారు. తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావు పై స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. శేషగిరిరావు ఇంట్లో ఉండగానే వైసీపీ గూండాలు దాడికి దిగారు. వైసీపీ ఆగడాలకు అడ్డుగా నిలబడి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసే టీడీపీ నేతల గళాలపై అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారు.

Read Also:
Twitter: అలా అయితేనే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్

తుని నియోజకవర్గంలో కాపులకు అన్యాయం చేస్తున్న వైసీపీ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారు. కాపు సామాజికవర్గంపై జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు గొడ్డళ్లతో వేటాడుతున్నారు.హత్యలు, దాడులు చేసి బెదిరించే ఈ దుష్ట ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు బాధితుల తరపున పోరాడుతాం అన్నారు అచ్చెన్నాయుడు. ఈ ఘటనపై మాజీ మంత్రులు యనమల, చినరాజప్ప స్పందించిన సంగతి తెలిసిందే.

Read Also: Chanrababu Sensational Comments Live: గెలిపించకపోతే రాజకీయాలకు గుడ్ బై