NTV Telugu Site icon

Atchannaidu: నారాయణ అరెస్ట్ అక్రమం

టెంత్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌ కొండాపూర్‌లో అరెస్ట్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహాం రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నారాయణ అరెస్ట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు అచ్చెన్న.

ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అచ్చెన్నాయుడు.

Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్