NTV Telugu Site icon

Atchannaidu: డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కు అలవాటే

Atchannaidu

Atchannaidu

డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జగన్ ప్రభుత్వానికి అలవాటే అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. సీఎం మీద.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడంతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్సుకు తెర లేపింది. వికేంద్రీకరణ గురించి జగన్ ప్రభుత్వం.. మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు. పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు కేరాఫ్ అడ్రస్ టీడీపీనే అనే విషయాన్ని సన్నాసనలైన మంత్రులు గుర్తించాలి. మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆరుదే. ప్రజల వద్దకు పాలన పేరుతో అధికారులను చంద్రబాబు ప్రజల ముంగిటకే పంపారు.

వికేంద్రీకరణ అంటే ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన సంస్కరణలే.స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వమా వికేంద్రీకరణ గురించి మాట్లాడేది..?ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ అమలు చేసే వికేంద్రీకరణ విధానం.నిధులన్నీ అమరావతిలో పెట్టారని కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్, అనంతకు కియా తెచ్చాం.విశాఖకు ఐటీ కంపెనీలు తెచ్చాం.ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు చెప్పిందన్నారు అచ్చెన్నాయుడు.

ఏపీలో మూడు రాజధానులు పెట్టాలని భావిస్తున్నాం.. దానికి అనుగుణంగా చట్టం చేయాలని విజయసాయి రెడ్డి పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టలేదా..? రాజధాని మార్చే హక్కు.. రాష్ట్రానికుంటే విజయసాయి ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టారు..?ధర్మానకు మూడేళ్లు నోరు పెగల్లేదు.. మంత్రి పదవి వచ్చాక ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. సేవ్ ఉత్తరాంధ్ర.. ఇదే నినాదం అన్నారు అచ్చెన్నాయుడు.

Read Also: violence in Mominpur: మోమిన్‌పూర్ హింసాకాండ.. కేంద్ర బలగాలను పంపాలని హోంమంత్రికి సువేందు లేఖ

ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రను కబళించేందుకు రాబందులు వస్తున్నాయి జాగ్రత్త.ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలను కొట్టేశారు.విశాఖలో జరిగిన భూ దొపిడీపై విచారణ కోరుతున్నాం.విశాఖ వాసులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.తెల్లారేసరికల్లా భూముల డాక్యుమెంట్లు మారిపోతున్నాయని విశాఖ వాసులు భయపడుతున్నారు.మూడు రాజధానుల అజెండాపై జగనుకు నమ్మకం ఉంటే.. అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి.మూడు రాజధానుల అజెండాపై వైసీపీ.. అమరావతే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళ్దాం.ఎన్నికల్లో ఎవరు గెలిస్తే.. వాళ్ల వాదనకు ఆమోదం లభించినట్టే.

దసపల్లా భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారు.రుషికొండను దొపిడీ చేస్తున్నారు. విశాఖలో మూడు బెడ్రూంల ఇల్లు తప్ప ఏం లేదన్న విజయసాయికి అన్ని ఎకరాలు ఎలా వచ్చాయి..? నాన్ పొలిటికల్ జేఏసీలో ఉన్న వాళ్లంతా వైసీపీ పేటీఎం బ్యాచ్. ఉత్తరాంధ్ర ప్రజలెవ్వరూ మూడు రాజధానుల గురించి అడగడం లేదు. పరిపాలనా రాజధాని పేరుతో దొపిడీకి తెర తీస్తున్నారు. కరణం ధర్మశ్రీలా నేను విశ్వసనీయత లేని నాయకుడుని కాను. అమరావతే రాజధాని అని ఎన్నికలకెళ్లిన వైసీపీ.. ఇప్పుడు మాట మార్చింది. ఇప్పుడు రాజీనామా చేయమని నన్ను అడగడం పిచ్చితనమే.కరణం ధర్మశ్రీ రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎందుకు రాజీనామా చేయలేదు..?

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణానికి చంద్రబాబు కరణం ధర్మశ్రీ నియోజకవర్గంలోనే శంకుస్థాపన చేశారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఈ ప్రభుత్వం ఆపేస్తే.. రాజీనామా ఎందుకు చేయలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. బొత్స, ధర్మాన, తమ్మినేని సీతారాంలే మంత్రులు కదా..?మీరంతా ఉత్తరాంధ్రను ఎందుకు అభివృద్ధి చేయలేదు..?అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకెందుకు కడుపు నొప్పి..?రైతులు పాదయాత్ర చేస్తే దండయాత్ర చేస్తారా..?శ్రీకాకుళం, అరసవెల్లి ధర్మాన జాగీరా..?నేను ఒళ్లు పెరిగినా బుర్ర కూడా ఉంది. బొత్సకు బుర్ర కూడా లేదు.

Read Also: Manickam Tagore: రేపు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్‌.. నెలరోజులు మకాం