NTV Telugu Site icon

Ashwini Vaishnaw: రైళ్లలో ఫస్ట్ ఎయిడ్‌పై విజయసాయిరెడ్డి ప్రశ్న.. జవాబిచ్చిన మంత్రి

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw Responds On Vijayasai Reddy Question On Railways First Aid: శుక్రవారం రాజ్యసభలో రైళ్లలోని ఫస్ట్ ఎయిడ్ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంధించిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జవాబిచ్చారు. రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్ళు, రైల్వే స్టేషన్లలో.. అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్‌ సిలిండర్‌ కలిగిన మెడికల్‌ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఫస్ట్‌ ఎయిడ్‌ సేవలు చేసేలా ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది అయిన ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ), ట్రైన్‌ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్‌ మాస్టర్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Karumuri Venkat Reddy: చంద్రబాబుపై కౌంటర్లు.. యువగళంపై సెటైర్లు

అన్ని ప్రయాణీకుల రైళ్ళతోపాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్‌ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్‌ ఎయిడ్‌ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్‌ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్‌లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఫస్ట్‌ ఎయిడ్‌ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్‌ కోర్సులు నిర్వహిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యులు, వారి మొబైల్‌ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆస్పత్రుల అంబులెన్స్‌ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్