టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కుంభంపాటి రాంమోహన్ రావును మంచి పదవిలో చూస్తామన్నారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల కష్టాలను పార్లమెంటులో ప్రస్తావించారన్నారు.
ప్రతీ ఒక్కరికి తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉండేలా చేసింది రాంమోహన్ అని, రాంమోహన్ కు శత్రువులు లేరు. అందరు మిత్రులేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో మొట్టమొదటి సారి వృద్ధాప్య పింఛన్ ఇచ్చింది ఎన్టీఆర్ అని, సంక్షేమాన్ని దేశానికి చెప్పింది ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ కు ఈ సంపాదన రావడం చంద్రబాబు వేసిన బీజమేనని, ఎంతో మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబునే గుర్తు చేసుకుంటున్నారన్నారు. స్టేట్స్ మెన్ చంద్రబాబు పొలిటీషియన్ కాదని, నాడు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపారన్నారని, దాంతో అధికారానికి గ్యాప్ వచ్చిందన్నారు. చంద్రబాబు వచ్చింది విరామమే కానీ విరమణ కాదని, రాష్టానికి, దేశానికి దిక్సూచి టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు.
