NTV Telugu Site icon

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. 20 శాతం ఛార్జీలు తగ్గింపు..

Apsrtc

Apsrtc

వరుసగా చార్జీలు పెంచుతూ పోయిన ఏపీఎస్‌ఆర్టీసీ.. ఇప్పుడు ప్రయాణికులకు బంపరాఫర్‌ ప్రకటించింది.. నెల రోజుల పాటు ఏసీ బస్సుల ఛార్జీల్లో డిస్కౌంట్ తీసుకొచ్చింది… ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గించింది ఆర్టీసీ.. ఏసీ బస్సుల ఛార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ తాజా ఆఫర్.. ఈనెల 30వ తేదీ వరకు వర్తించనుంది… అయితే, ఏ రూట్లల్లో, ఏయే బస్సుల్లో ఛార్జీలు.. ఎంత మేర తగ్గించాలనే విషయమై ఆర్ఎంలకు నిర్ణయాధికారం కట్టబెట్టింది ఏపీఎస్‌ఆర్టీసీ…

Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఒక విఫల నాయకుడు..!

ఇక, ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు జిల్లాల ఆర్టీసీ అధికారులు… వాటి ప్రకారం.. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే ఏసీ బస్సుల్లో 10 శాతం ఛార్జీ తగ్గనుండగా… అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సు సర్వీసుల్లో ఛార్జీల్లో 10 శాతం తగ్గించనున్నట్టు వెల్లడించారు.. శుక్రవారం , ఆదివారాల్లో మినహా మిగిలి రోజుల్లో ఛార్జీలు తగ్గిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది… మరోవైపు, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే డాల్ఫిన్ క్రూయిజ్ లో 20 శాతం ఛార్జీని తగ్గించారు.. విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లోనూ 20 శాతం ఛార్జీ తగ్గింపు వర్తించనుంది… అమరావతి, వెన్నెల ఎసీ సర్వీసుల్లో శుక్ర, ఆది వారాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలు తగ్గింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీఎస్‌ఆర్టీసీ…

Show comments