APSRTC good news on Compassionate Appointments: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న అయిన వారిని దూరం చేసుకున్న వారికి సంస్థ శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐపిఎస్ కారుణ్య నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంతో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలా మొత్తం 294 మందికి ఉద్యోగావకాశం కల్పించనుంది ఏపీఎస్ ఆర్టీసీ. ఇక ఈ కారుణ్య నియామకాలతో ౩4 మంది జూనియర్ అసిస్టెంట్లు, 99 మంది ఆర్టీసీ కానిస్టేబుల్స్, 99 మంది అసిస్టెంట్ మెకానిక్ లు, 61 మంది కండక్టర్లు , ఒక డ్రైవర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
Disha SOS Effect: అనుమానంతో ప్రియురాలిపై దాడి.. ‘దిశా’ దెబ్బకి బుద్ధొచ్చింది!
ఇక ఏపీఎస్ఆర్టీసీ విధ్యాధరపురం ట్రాన్స్ పోర్ట్ అకాడమీలో ఈ రోజు ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇక ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవానికి సంస్థ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని సూచనలు చేశారు. 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. శిక్షణా కాలంలో ఉద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. ఇక వస్తాయో? రావో? వస్తే ఎప్పుడు వస్తాయి? అని తెలియక ఇబ్బందులు పడుతున్న చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఈ సందర్భంగా ఆనందం వెల్లివిరిసింది.
APSRTC: వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 294 మందికి ఉద్యోగావకాశం!
Show comments