Digital Payments: మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది.. డిజిటల్ పేమెంట్లను ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.. ఆన్ లైన్ లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. తొలుత రాష్ట్రంలోని 11 మద్యం ఔట్ లెట్లల్లో ఆన్ లైన్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. మూడు నెలల్లో మిగతా మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను అమలుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,708 మద్యం షాపులు.. ఔట్ లెట్స్ ఉండగా.. మొదట 11 మద్యం ఔట్‌లెట్లలోనే ఇది అమల్లోకి వచ్చింది.. ఎస్బీఐ సహకారంతో మద్యం విక్రయాల్లో ఆన్ లైన్ చెల్లింపు తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ.. ఇక, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు నిబంధనల ప్రకారం ఛార్జీల వసూలుకు నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా.. క్యాష్‌లెన్స్ లావాదేవీలు కూడా అందుబాటులోకి రావడంతో.. మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. అంటే.. జేబులో క్యాష్ లేకున్నా సరే.. కార్డులు ఉన్నా.. మొబైల్ ఉన్నా.. లిక్కర్ కొనుగోలు చేసుకోవచ్చు.
Read Also: Digital Payments: మద్యం విక్రయాల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఇలా కూడా..
