NTV Telugu Site icon

Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..

Rtc Bus

Rtc Bus

Road Accident: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది.. అయితే, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. అతివేగంతో.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి.. బోల్తాకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా అంతా నిద్ర మత్తులో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారని.. ఎవరికీ ఎటువంటి ప్రాణప్రాయంలేదని డాక్టర్లు చెబుతున్నారు.. ప్రమాదం జరిగినా.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో.. అధికారులు, ప్రయాణికుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: CM YS Jagan: నేడు తిరువూరులో సీఎం పర్యటన.. వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ..

Show comments