ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు తేదీని ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)… స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.. అయితే, ఏపీలో ఖాళీగా ఉన్న 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తు గడువు నవంబర్ 5వ తేదీతో ముగిసిపోయింది.. ఇక, ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తున్న ఏపీపీఎస్సీ.. ఈ నెల 31వ తేదీ నుంచి హాల్ టికెట్లు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు..
Read Also: Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. న్యూయర్ వేడుకల కోసం అర్థరాత్రి వరకు మెట్రోసర్వీసులు
ఇక, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష విధానానికి వస్తే.. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉండగా.. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు.. ఇందులో జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడగనున్నారు.. ఇందులోనూ నాలుగు విభాగాలు ఉండబోతున్నాయి.. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించడం జరిగింది.. మరోవైపు మిగతా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుగా ఉండగా.. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయిస్తారు. మొత్తం ఖాళీల సంఖ్య 92గా ఉండగా.. అందులో క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్త పోస్టులు 90గా ఉన్నాయి.. ఇక, ఆ పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్ 10 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ 12 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు (సివిల్) క్యాట్-2 పోస్టులు 13, డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ (మెన్) పోస్టులు 2, డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులు 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 8, రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్ పోస్టులు 2, మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 7, డిస్ట్రిక్ట్ రిజిస్టార్స్ పోస్టులు 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు 1, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 2, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II పోస్టులు 6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-II పోస్టులు 18, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టు 1, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 4 ఉన్నాయి.