Vijayawada: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతిచెందారు.. విజయవాడలోని డీవీ మనార్ హోటల్‌లోని రూంలో విగతజీవిగా పడి ఉన్న శివ కుమార్ రాజు ( 74 )ను గుర్తించారు హోటల్ సిబ్బంది.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ గా గుర్తించారు.. అయితే, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.. పాత కేసుల ఎవిడెన్స్ కోసం కోర్టుకు హాజరు నిమిత్తం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లిన శివకుమార్ రాజు.. ఈ నెల 5వ తేదీన హోటల్లో రూమ్‌లో దిగారు.. అయితే, ఉదయం నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా, బెల్ కొట్టినా శివకుమార్ రూమ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది.. మారు తాళం పెట్టి గదిలోకి వెళ్లి చూడగా.. నుదిటి మీద గాయంతో విగతజీవిగా పడిఉండడాన్ని గమనించారు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్య హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
ఇక, ఘటనా స్థంలో క్లూస్ సేకరించారు పోలీసులు.. మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, ట్యాబ్‌లెట్స్ గుర్తించారు.. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. దీంతో, హైదరాబాద్ నుండి విజయవాడ బయల్దేరి వెళ్లారు కుటుంబ సభ్యులు.. కాగా, హైదరాబాద్‌లోని మలేషియా టౌన్‌షిప్‌లో నివాసం ఉండేవారు శివకుమార్ రాజు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బంజారాహిల్స్ లో ఉన్న ఓ ల్యాబ్స్‌లో పనిచేస్తున్నారు. విజయవాడ కోర్టులో వాయిదా కోసం.. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఎంజీ రోడ్డులోని హోటల్ రూమ్‌లో బస చేశారు.. శనివారం ఉదయం అల్పాహారం ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్ సిబ్బంది తలుపుకొట్టారు. ఆయన తీయకపోవడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించారు. మళ్లీ మధ్యాహ్నం 1గంటకు గది ఖాళీ చేస్తారో, ఉంటారో తెలుసుకోవడానికి ఇంటర్‌కంకు ఫోన్ చేశారు. ఆయనా ఆయన నుంచి స్పందనలేదు.. దీంతో సిబ్బంది మాస్టర్ కీ తీసుకుని తలుపు తీసి చూడగా శివకుమార్ చనిపోయి ఉన్నాడు..