Site icon NTV Telugu

AP Youth Trapped: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను అమ్ముతున్న వైనం.. నరకం చూపిస్తున్న ఏజెన్సీలు

Ap

Ap

AP Youth Trapped: ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళిన తెలుగు యువతపై అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. విదేశీ ఏజెన్సీల మోసపూరిత విధానాలతో మయన్మార్ సరిహద్దులో ఏపీ యువత బందీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు చెందిన 21 మంది యువకులు బందీగా ఉన్నట్లు తెలుస్తుంది. మొదట థాయిలాండ్‌లో ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో స్నేహితులంతా ఉద్యోగాల కోసం వెళ్లగా, ఆ తర్వాత మోసపోయారు. అయితే, థాయిలాండ్ ఏజెన్సీ నిర్వాహకులు మొదట ఆశలు చూపించి ఉద్యోగాల్లో చేర్చగా, తరువాత మయన్మార్ ఏజెన్సీకి యువతను అమ్మేశారు. అక్కడ యువతను ఆన్‌లైన్‌లో అమ్మాయిల మాదిరి మాట్లాడిస్తూ చాటింగ్ చేయించడమే పని అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పని చేయలేమని చెప్పగానే ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు తెలియజేశారు.

Read Also: Asim Munir: దేవుడు నన్ను రక్షకుడిని చేశాడు.. నాకు ఏ పదవి వద్దు..

అయితే, విదేశీ ఏజెన్సీల నునంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శాశ్వతంగా జైల్లో నిర్బంధిస్తామనే బెదిరింపులను కూడా ఎదుర్కొంటున్నారని బాధితులు తెలిపారు. దీంతో మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాలు వినిపించారు. మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలియదు, మా లొకేషన్ కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, బాధిత యువత కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులను వరుసగా కలుస్తున్నారు. దీంతో నంద్యాల ఎంపీ, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరిని ఢిల్లీలో బాధితుల తల్లిదండ్రులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఎంపీ శబరి విదేశాంగ శాఖకు స్వయంగా కంప్లైంట్ చేశారు. ఇక, అదే విధంగా ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నేరుగా వీడియో కాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది.

Read Also: Roja Reaction Jr NTR Row: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆర్కే రోజా హాట్ కామెంట్స్!

ఇక, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి చెందిన యువకులు ఉపాధి కోసం మయన్మార్ కి వెళ్తే.. అక్కడ కిడ్నాప్ కు గురయ్యారనీ తెలియజేశారు. బాధితులను భారత్ కు తీసుకోచ్చేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరారు. బంధించబడి తీవ్రమైన హింస, బలవంతపు పనులకు గురవుతున్న తమ రాష్ట్ర యువతను తక్షణమే విడుదల చేసి తీసుకు రావాలన్నారు.

Exit mobile version