Site icon NTV Telugu

MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన మహిళా కమిషన్.. డీజేపీకి లేఖ

Vasireddy Padma

Vasireddy Padma

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం రచ్చగా మారింది.. ఓ మహిళలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌గా వీడియో కాల్‌ మాట్లాడారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. దీంతో, ఎంపీ రాజీనామా చేయాలనే డిమాండ్‌ ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే వినిపిస్తోంది.. మరోవైపు, అది ఫేక్‌ వీడియో, మార్ఫింగ్‌ చేశారంటూ సదరు ఎంపీ ఆరోపించారు.. దీనిపై విచారణ జరుపుతామని.. ఆ వీడియో నిజమేనని తేలితే.. ఎంపీ గోరంట్ల మాధవ్‌వై కఠిన చర్యలు తప్పవని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చెబుతున్నమాట.. అయితే, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ స్పందించింది.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాసింది మహిళా కమిషన్‌.. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గు తేల్చాలని.. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. అయితే, ఎంపీకి సంబంధించిన అశ్లీల వీడియోపై మహిళా కమిషన్‌ కూడా స్పందించడంతో.. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తప్పవా? అనే చర్చ మొదలైంది.

Read Also: Komatireddy Rajgopal Reddy : తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా, ఓటుకు నోటు కేసులో వెళ్లాడా

Exit mobile version