MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన మహిళా కమిషన్.. డీజేపీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రచ్చగా మారింది.. ఓ మహిళలో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. దీంతో, ఎంపీ రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే వినిపిస్తోంది.. మరోవైపు, అది ఫేక్ వీడియో, మార్ఫింగ్ చేశారంటూ సదరు ఎంపీ ఆరోపించారు.. దీనిపై విచారణ జరుపుతామని.. ఆ వీడియో నిజమేనని తేలితే.. ఎంపీ గోరంట్ల మాధవ్‌వై కఠిన చర్యలు తప్పవని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెబుతున్నమాట.. అయితే, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాసింది మహిళా కమిషన్.. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గు తేల్చాలని.. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. అయితే, ఎంపీకి సంబంధించిన అశ్లీల వీడియోపై మహిళా కమిషన్ కూడా స్పందించడంతో.. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తప్పవా? అనే చర్చ మొదలైంది.
Read Also: Komatireddy Rajgopal Reddy : తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా, ఓటుకు నోటు కేసులో వెళ్లాడా
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!