Site icon NTV Telugu

ఏపీ అదనపు హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

ఈ భవనాన్ని గ్రౌండ్‌+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, సీఆర్‌డీఏ అధికారులు హాజరు కానున్నారు.

Exit mobile version