Site icon NTV Telugu

ఇవాళ యథాతథంగా వాహనాల రిజిస్ట్రేషన్లు..

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సర్వర్‌ గురువారంరోజు మొరాయించింది.. 2022 జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరగడంతో.. ఆ తాకిడితో రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగిపోయాయి.. దీంతో.. సాంకేతిక సమస్య పరిష్కారినిక నిపుణులు రంగంలోకి దిగి చక్కబెట్టారు.. ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయినట్టు వెల్లడించారు ఏపీ రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఈరోజు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని ప్రకటించారు.

Read Also: కోవిడ్‌కు చెక్..! మార్కెట్‌లోకి టాబ్లెట్‌.. ధర రూ.63..

కాగా, ఈ వ్యవహారంపై గురువారం రోజు స్పందించిన మంత్రి పేర్ని నాని.. ఏపీ రవాణా శాఖ సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.. T/R ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని.. సాఫ్ట్‌వేర్ ను సరిచేసే పనిలో ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు.. సర్వర్ డౌన్ కావడంతో వాహన కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిసెంబర్ 31లోపు వాహనం కొన్న ఇన్వాయిస్ ఉంటే, ఇన్సూరెన్స్ కట్టిన పేపర్ ఉంటే ఈ ఏడాది ట్యాక్స్‌ వర్తిస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version