Rain Alert: గత వారం రోజుల నుంచి చలి ప్రభావం పెరిగింది. ఉదయమే కాకుండా మధ్యాహ్నం కూడా ఎండ అస్సలు కనిపించడం లేదు. వాతావరణం అంతా మేఘావృతమై పొగమంచు, చలి నగరవాసులకు బయటకు రావాలంటే జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా.. ఉత్తర భారతం మీదుగా వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో పొడి వాతావరణం దక్షిణ భారతదేశం వైపు ప్రయాణిస్తుంది…దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది…అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇవాళ్టి నుంచి చలి తన ప్రభావం ఏంటో చలి చూపించనుంది. గతంలో ఎప్పుడూ చూడని చలిని ఈసారి చూస్తారని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో అక్కడ ఉంటే పొడి వాతావరణం దక్షిణ భారత్‌వైపు ట్రావెల్ చేయనుంది. అయితే..దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగనుంది, అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా.. ఉత్తరభారత దేశాన్ని వణికిస్తున్న చలి తీవ్రత తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుంది. కాగా.. అక్కడ ఉన్న పొడి వాతావరణం మనవైపు రానుంది. దీనివల్ల వాతావరణంలో చాలా మార్పులు గమనించవచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంంది.
Read also: Atrocity in temple: ఆలయంలో ఘోరం.. మహిళ జుట్టు పట్టి ఈడ్చి బయటపడేశారు
ఇక రాయసీమలోని దక్షిణ భాగంలో కూడా మేఘావృతమై ఉంటుంది. బంగాళాఖాతంలో దక్షిణ భాగాల్లో కూడా చల్లటి వాతావరణ ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. నేటి నుంచి రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చలి వణికించనుంది…చాలా ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్ర ఎక్కువగా ఉంటుంది. కాగా..కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉంది. తెలంగాణలో నిన్నటి నుంచే చలి తీవ్రత మొదలైపోయింది. తెలంగాణలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. నగరవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఒక మరో నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న వాన పడటంతో డ్రైలైన్ షవర్స్ కారణంగా చలి తీవ్రత మరింత పెరగుతుందని పేర్కొంది. దీంతో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, కొమ్రంభీం, భద్రాద్రి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో చలి వణికించబోతోంది.
Naga Babu: నీది నోరా మున్సిపాలిటీ కుప్పతొట్టా ? రోజా పై నాగబాబు ఫైర్..