ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనివార్య కారణాల వల్ల పదో తరగతి ఫలితాలు విడుదల చేయలేపోతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. పదో తరగతి ఫలితాలు సోమవారం నాడు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
మరికొన్ని గంటల్లో ఫలితాలు విడుదలవుతాయనుకన్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. అయితే.. ముందుగా చెప్పినట్లుగా అనుకన్న సమయానికి ఫలితాలు విడుదల చేయడంతో సాంకేతిక లోపం చోటు చేసుకోవడంతో.. దాన్ని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. గంట ఆలస్యంగానైనా సరే విడుదల చేస్తామనుకున్నారు. కానీ.. సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫలితాల విడుదలను వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
