Site icon NTV Telugu

చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డ తమ్మినేని…

చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శల పై కౌంటర్ అటాక్ చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిమీద పెట్టి హైదరాబాద్ లో కూర్చున్నావ్. జగన్ మీద విశ్వాసం ఉంది కాబట్టే బ్యాంకులు అప్పులిస్తున్నాయి. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జగన్ నానా కష్టాలు పడుతున్నారు. అగ్రిగోల్డ్ లో బోర్డు తిప్పేసిన ముసుగువీరులెవరో అందరికీ తెలుసు. నేనిప్పుడు ఆ పేర్లు చెబితే ఏడ్చి చస్తారు. అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేస్తే గతంలో మీ ప్రభుత్వం అండగా నిలిచింది అని తెలిపారు. ఏమాత్రం సిగ్గు, లజ్జ , ఉచ్చనీచాలు లేవు మీకు. హైదరాబాద్ వెళ్లి జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టే మీకు , మీ పార్టీ నేతలకు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడిగారు.

Exit mobile version