AP SI Preliminary Results 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది (ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు) పోలీసు నియామకమండలి.. ఈ నెల 19న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఒఎమ్ఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు నియామక మండలి తన ప్రకటనలో పేర్కొంది.. ఈ ఫలితాలను slprb.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
Read Also: New Zealand vs England: ఉత్కంఠ రేపిన టెస్ట్ మ్యాచ్.. చరిత్ర సృష్టించారు..
411 పోస్టల కోసం ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో 57,923 మంది అర్హత సాధించారు.. అందులో పురుష అభ్యర్థులు 49,386 మంది ఉండగా.. మహిళా అభ్యర్థులు 8.537 మంది ఉన్నారు.. మరోవైపు.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీపై కొన్ని అభ్యంతరాలు వచ్చినా.. వాటిని పరిశీలించిన నిపుణుల కమిటీ.. కీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు..