Site icon NTV Telugu

ఏపీకి మరో రెండు లక్షల వ్యాక్సిన్లు… 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  కేంద్రం నుంచి వ్యాక్సిన్ ను తెప్పించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది.  ఇక మే 1 నుంచి వ్యాక్సిన్ ను రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా కూడా  అడుగులు వేస్తున్నది.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు రెండు లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.  వీటిని గన్నవరం లోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.  అక్కడి నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు వివిధ జిల్లాలకు పంపిణి చేయబోతున్నారు.  

Exit mobile version