NTV Telugu Site icon

AP Rain Alert : మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు..

Ap Rains

Ap Rains

భారత దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేసాయి.. గత కొద్ది రోజులు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తుంది.. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..ఉక్కపోత తో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు. ఏపీతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అటు విదర్భలోని కొన్ని భాగాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రదేశాలు.. జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని భాగాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

రాబోయే మరో మూడు రోజులు ఏపీ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు..  ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీస్తాయి.. అదే విధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు..

ఇక రేపు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతోవీస్తాయని అంటున్నారు..

ఎల్లుండి..ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు..